కొత్త పదవి..అందరిని కలుపుకు పోవాలి

 

తెలంగాణ సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క ఎన్నికైన సంగతి తెల్సిందే. కాగా కొత్త పదవిపై భట్టి తాజాగా మీడియాతో మాట్లాడారు. నేతల అభిప్రాయం, రాహుల్‌ ఆశీస్సులతో సీఎల్పీ నేతనయ్యానని భట్టి తెలిపారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని అన్నారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని, పార్టీ ప్రతిష్టను పెంచుతాని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకుంటానని చెప్పారు. అసెంబ్లీలో సంఖ్యా బలం తక్కువనేది సమస్యకాదని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి తెస్తానని అన్నారు. నిరుద్యోగ, రైతు సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు నిబద్ధత కలిగిన సైనికులని, ఎవరూ పార్టీ మారరని తెలిపారు. ఇదంతా టీఆర్‌ఎస్‌ మైండ్‌గేమ్‌ అని అన్నారు. ప్రతిపక్షం కూడా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం దుర్మార్గమని భట్టి మండిపడ్డారు.