TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్‌కు చేరుకున్న ఖర్గేకు సీఎం రేవంత్‌ ఘన స్వాగతం

Published on: Thu Jul 3, 2025 8:33PM

 

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో ఖర్గే పాల్గొననున్నారు. రేపు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం, బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు తరలిరావాలని సక్సెస్​చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేరుగా మండల అధ్యక్షులతో మాట్లాడున్నారు.