ఐక్య రాజ్యసమితి వేదిక పై అదరగొట్టిన 'మలాలా'

 

 

 

ఐక్యరాజ్య సమితి యూత్ అసెంబ్లీ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యువజన నాయకులు ఐక్య రాజ్యసమితిలో సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా ఐక్య రాజ్యసమితి వేదిక మీది నుంచి మలాలా స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసింది.

 

'మలాలా డే' నాకు మాత్రమే పరిమితమైన రోజు కాదు. ఇది హక్కుల కోసం గొంతెత్తే ప్రతి ఒక్కరిది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదుల దుశ్చర్యల బాధితుల్లో నేనూ ఉన్నా. గొంతెత్తి మాట్లాడలేని వారి తరఫున నేను మాట్లాడుతున్నా. గత ఏడాది అక్టోబర్ 9న తాలిబన్లు నన్ను కాల్చారు. బుల్లెట్లు మా నోళ్లు మూస్తాయని వారు భావించారు. కానీ అధైర్యం నశించి, పోరాటం పుట్టుకొచ్చింది' అని వ్యాఖ్యానించింది. మహాత్మా గాంధీ అహింసా సిద్దాంతం, మదర్ థెరిస్సా సేవాగుణం తనకు స్ఫూర్తినందించాయని చెప్పింది. మార్టిన లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, మొహమ్మద్ అలీ జిన్నావంటి వారి నుంచి తాను ఆయుధాన్ని స్వీకరించినట్లు తెలిపింది.

పుస్తకాలు, కలాలు తీసుకోవాలని, అవి అత్యంత శక్తివంతమైన ఆయుధాలని ఆమె అన్నది. ఒక చిన్నారి, ఓ టీచర్, ఓ పుస్తకం, ఓ కలం ప్రపంచాన్ని మార్చేస్తాయని అన్నారు. విద్యనే అన్నింటినీ పరిష్కారమని అభిప్రాయపడింది. తన లక్ష్యాలను, ఆకాంక్షలను అడ్డుకుంటామని ఉగ్రవాదులు భావించారని, తన జీవితంలో ఏమీ మారలేదని, బలహీనత, భయం, నిరాశ తొలగిపోయాయని చెప్పింది. శక్తి, ధైర్యం, పరిమళం సమకూరాయని చెప్పింది.