Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మహేష్ "ఆగడు"కు ముహూర్తం ఖరారు
posted on: Sep 20, 2013 3:51PM
.jpg)
మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న తాజా చిత్రం"ఆగడు". ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్ 16న ముహూర్తం షాట్‌తో ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పాటల కంపోసింగ్ ను సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే మొదలుపెట్టేశాడు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. శ్రీనువైట్ల ఈ చిత్రాన్ని"దూకుడు"ని మించిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్నాడని తెలిసింది.
మహేష్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "1-నేనొక్కడినే" చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.






