TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లండన్‌లో గాంధీజీ విగ్రహావిష్కరణ

Published on: Sat Mar 14, 2015 4:05PM

 

 

మన దేశానికి స్వాతంత్ర్యం రావడంలో ప్రముఖ పాత్ర వహించింది ఎవరూ అని అడిగితే మొదట వచ్చే సమాధానం గాంధీజీ. అలాంటి గాంధీజీ గొప్పతనాన్ని మన దేశంలోనే కాదు ఇతరదేశం వాళ్లు కూడా గుర్తించారు. ఎవరంటారా ఎవరైతే గాంధీజీ వల్ల మన దేశాన్ని వదిలి పెట్టి వెళ్లారో వాళ్లే... బ్రిటిష్ వాళ్లు. విషయం ఏంటంటే లండన్ లోని పార్లమెంట్ స్క్వేర్ వద్ద శనివారం భారత జాతిపిత మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, భారత్ నుంచి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ హాజరయ్యారు.