రాజీనామా వాపస్ తీసుకోవాలని డిమాండ్ ...
Published on: Thu Sep 27, 2012 10:43AM
.png)
మహారాష్ట్ర రాజకీయాలు చాలా వేడిగా సాగుతున్నాయి ఉపముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా చేసిన తరువాత పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశమైన ఎన్.సి.పి. లెజిస్లేచర్ పార్టీ ఇరవై నిముషాల్లోనే ఒక నిర్ణయానికి వచ్చింది. పవార్ రాజీనామా లేఖను ఉపసంహరించుకోవాలని ఈ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేల మనోభావాల ఎన్.సి.పి. అధ్యక్షుడు శరద్ పవార్ కు తెలియజేయాలని నిర్ణయించారు. అజిత్ పవార్ రాజీనామాపై నిర్ణయాన్ని శరద్ పవార్ కే వదిలేయాలని ఎన్.సి.పి. నేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పృథ్వీ రాజ్ చవాన్ ఇంకా రాజీనామాను అంగీకరించలేదు. విద్యాభవన్ లో జరిగిన సమావేశానికి 60 మంది ఎమ్మెల్యేలు. 9 మంది ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అటు పృథ్వీరాజ్ చవాన్ తన నివాసంలో కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపి పరిస్థితిని సమీక్షించారు.


