మహా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్!

posted on: Jan 31, 2026 8:09AM

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా దివంగత నేత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ శనివారం (జనవరి 31) ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.  రాజ్యసభ సభ్యురాలైన సుచిత్రా పవార్ నియమకాన్ని ఖరారు చేసేందుకు  ఎన్సీపీ శాసనసభాపక్షం సమావేశం కానుంది. శనివారం (జనవరి 31) మధ్యాహ్నం ముంబైలోని విధాన్ భవన్ లో జరిగే ఈ సమావేశంలో సునేత్రాపవార్ ను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం సాయంత్రం రాజ్ భవన్ లో గవర్నర్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.   విమాన ప్రమాదంలో అజిత్ పవార్  మరణించిన  నేపథ్యంలో పార్టీలో నాయకత్వ కొనసాగింపు, పాలనలో స్థిరత్వం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. 

ఇలా ఉండగా ఎన్సీపీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మహా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఎన్సీపీ నాయకత్వ బాధ్యతలను, ఉపముఖ్యమంత్రి పదవిని  సునేత్ర పవార్‌కు అప్పగించాలని పార్టీ నిర్ణయించిందని  ఎన్సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్ తెలిపారు.  ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర పవార్, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోగా రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఆమె పోటీ చేయనున్నారు. ఇక పోతే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సునేత్ర పవార్ కు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఏ శాఖను కేటాయిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొని ఉంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...