Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్న మాజీ మంత్రి జూపల్లి!
posted on: Oct 27, 2011 2:21PM
హైదరాబాద్: మహబూ
బ్ నగర్ జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.అధికారికంగా ప్రకటించనప్పటికీ దాదాపు జూపల్లి కాంగ్రెసుకు గుడ్‌బై చెప్పి టిఆర్ఎస్‌లో చేరతారని ఊహాగానాలు జోరుగా ఊపందుకున్నాయి. ఈ నెల 30వ తారీఖున ఆయన కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. నవంబరు 1వ తారీఖు నుండి మూడు రోజుల పాటు టిఎఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇందిరా పార్కు వద్ద దీక్ష చేసే విషయం తెలిసిందే. ఈ దీక్షలలో జూపల్లి కూడా పాల్గొనే అవకాశాలున్నాయి.మూడవ తారీఖున దీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాత నవంబర్ 4న ఆయన టిఆర్ఎస్‌లో చేరతారు. ఇప్పటికే టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో జూపల్లి భేటీ అయి కాంగ్రెసుకు రాజీనామా, దీక్షలో పాల్గొనే అంశం, టిఆర్ఎస్‌లో చేరే అంశంపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
జూపల్లితో పాటు జిల్లాకే చెందిన ఓ పార్లమెంటు సభ్యుడు కూడా టిఆర్ఎస్‌లో చేరనున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. కాగా ఇప్పటికే జూపల్లి తెలంగాణ కోసం మంత్రి పదవి కోసం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.కాగా టిఆర్ఎస్‌లో తాను చేరుతున్నట్లు వస్తున్న వార్తలను జూపల్లి ఖండించారు. తాను టిఆర్ఎస్‌లో చేరుతున్నాననే వార్తలు అవాస్తవమన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కోర్టుకు వెళతానని చెప్పారు. నవంబర్ 1వ తేదిన కాంగ్రెసు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసే దీక్షలో పాల్గొంటానన్నారు.


.jpeg)
.jpeg)


