Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తమిళనాడు తెలుగు విద్యార్ధులకు మద్రాసు హైకోర్టు ఊరట..
posted on: Nov 24, 2015 3:29PM

నిర్భంధ తమిళం పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలుగు ప్రజలకు ఊరట లభించింది. తమిళ ప్రభుత్వం నిర్బంధ తమిళం పేరుతో జీవో జారిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రకారం వచ్చే ఏడాది జరిగే పదో తరగతి పరీక్షల్ని విద్యార్ధులు తమిళంలోనే రాయాల్సి ఉంది. ఒక్క తెలుగు విద్యార్ధులు మాత్రమే కాదు.. కన్నడ, మళయాళ ఉర్ధూ పరీక్షలు రాసే విద్యార్ధులు కూడా తమిళంలోనే పరీక్షలు రాయాల్సిఉంది. ఈ నేపథ్యంలో విద్యార్ధి సంఘాలు పలు ఆందోళనలు చేపట్టినా ఫలితం శూన్యం. దీంతో అఖిల భారత తెలుగు సమాఖ్య నేతృత్వంలోని మైనారిటీ భాషా సంఘాలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కోర్టు వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల్ని విద్యార్థులు వారి మాతృభాషలోనే రాయవచ్చని స్పష్టం చేసింది. అంతేకాదు ఈ చట్టంపై తెమిళనాడు ప్రభుత్వంపై మొట్టికాయలు కూడా వేసినట్టు తెలుస్తోంది. నిర్బంధ తమిళంపై చేసిన చట్టం సదుద్దేశంతో రూపొందించినది కాదని, ఆ తర్వాత కూడా ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేదని కోర్టు అభిప్రాయపడింది. అసలు 2006లో చట్టం రూపొందగా, ఆరేళ్ల తర్వాత 2012లో ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించడం ఏంటని ప్రశ్నించింది. మొత్తానికి తమిళనాడు ప్రభుత్వం తెలుగు భాషపై వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టంపై ఆ రాష్ట్ర హైకోర్టు అండగా ఉంటడం శుభపరిణామామే.


.jpg)



