కాలుజారిన మడోనా

Publish Date:Feb 26, 2015

 

ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ మడోనా కాలు జారింది. అపార్థం చేసుకోకండి.. పాపం మడోన్నా నిజంగానే కాలు జారి పడిపోయింది. లండన్లో జరిగిన బ్రిట్ అవార్డ్స్ ఫంక్షన్లో తన బృందంతో కలసి మడోనా మాంఛి ఉత్సాహంగా పాడుతూ ఆడుతూ వుండగా, సెట్‌లోని మెట్ల మీద నిల్చున్న ఆమె అకస్మాత్తుగా వెనక్కి పడిపోయింది. కనీసం నిలదొక్కుకోవడానికి కూడా వీల్లేకుండా దఢేల్మని కింద పడిపోయింది. పాపం, మడోనా డాన్సులూ అవీ బాగానే చేస్తుందిగానీ, వయసు మాత్రం మీద పడిపోయింది కదా.. ఇప్పుడు ఆమెకు 56 ఏళ్ళు... ఆ వయసులో కూడా డాన్స్ చేస్తున్న ఆమె ఒక్కసారిగా కింద పడిపోవడంతో ఏమవుతుందో అని ఆ షో చూస్తున్న అందరూ భయపడిపోయారు. అయితే మడోనా మాత్రం చలాకీగా లేచి నిల్చుని షో కంటిన్యూ చేసింది. మడోనా అలా పడిపోయిందో లేదో ఇలా ఆ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేయడం మొదలెట్టాయి. ట్విట్టర్లో అయితే ఇదొక కామెడీ సబ్జెక్ట్ అయి కూర్చుంది. ఇదిలా వుంటే, మడోనా కూడా తాను పడిపోతున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇది తనకు ఒక కొత్త అనుభవం అని చెప్పుకుంది.

By
en-us Political News