TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భాను చిక్కడు ... నయీం దొరకడు

Published on: Sat Mar 24, 2012 10:33AM

రాష్ట్రంలో సంచలన హత్యలు చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నేరగాళ్ళు పోలీసులకు సవాల్ గా మారారు. వారిలో ఒకరు మద్దెలచెరువు సూరిని హత్యచేసిన వారు, మరొకరు మావోయిస్టు మాజీ నేత, టి.ఆర్.ఎస్. నాయకుడు అయిన సాంబశివుడిని హత్య చేసిన నయీం. వీరిద్దరి ఆచూకీ కోసం పోలీసులు చాలా కాలంగా తీవ్రంగా గాలిస్తున్నారు. భాను కొంతకాలం ఒక టిడిపి నేత ఆశ్రయంలో ఉండి తరువాత అక్కడినుంచి వేరోచోటికి వెళ్ళిపోయాడన్న వార్తలు వచ్చాయి. ఎప్పటికప్పుడు పోలీసులు హడావిడి చేస్తూ భానులాంటి వ్యక్తిని పట్టుకోవడం తరువాత అతడు భాను కాడని తేలడంతో వదిలివేయడం జరుగుతోంది. నయీం విషయానికి వస్తే అతని ఆచూకీ మూడు నెలలుగా తెలియడం లేదు. గతంలో నక్సల్స్ దళంలో పనిచేసిన నయీం తరువాత కోవర్ట్ గా మారాడు. సుమారు ఏడాదిక్రితం మావోయిస్టు మాజీనేత, తెరాస పొలిట్ బ్యూరో సభ్యుడు సాంబశివుడిని దారుణంగా హత్యచేశాడు. ఇతని ఆచూకీ కూడా ఇప్పటిదాకా తెలియలేదు. దీంతో పోలీసుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంబశివుడి హత్య వెనుక భువనగిరి ప్రాంతానికి చెందిన కొందరు రాజకీయ నేతలు, పోలీసు అధికారుల ప్రమేయం ఉందని తెరాస నాయకులు ఆరోపిస్తున్నారు. నయీంను పోలీసులే కాపాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.