మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై దాడి

posted on: May 13, 2024 2:52PM

ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ రౌడీ మూకలు మరింతగా పేట్రేగిపోతున్నారు. ఇప్పటి వరకు బూత్‌ల మీద దాడి, తెలుగుదేశం పోలింగ్ ఏజంట్ల మీద దాడి, పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్, గాయపరచడం లాంటి చర్యలు చేపట్టిన వైసీపీ మూకలు ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం అభ్యర్థి బ్రహ్మారెడ్డి మీద దాడి చేశాయి. ఓడిపోతున్నామన్న బాధతో వైసీపీ వర్గాలు ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం లచ్చంబాయి దగ్గర తెలుగుదేశం అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి కాన్వాయ్ మీద వైసీపీ గూండాలు దాడి చేశారు. కాన్వాయ్‌లోని ఒక కారుకు నిప్పు పెట్టారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...