Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'మా' కేసు 9కి వాయిదా
posted on: Apr 7, 2015 1:01PM

రాజకీయ ఎన్నికల కంటే వేడిగా మార్చి 29న మా ఎన్నికలు జరిగాయి. మా అధ్యక్ష స్థానానికి నటి జయసుధ, ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ పోటీ పడ్డారు. అయితే ఎన్నికలు జరగటానికి సిటీ సివిల్ కోర్టు అనుమతి ఇచ్చింది, కానీ తమ అనుమతి లేనిదే ఎన్నికల ఫలితాలు ప్రకటించకూడదని షరతు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మా ఎన్నికల ఫలితాల పిటిషన్ పై విచారణను సిటీ సివిల్ కోర్టు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల అధికారులను కోర్టు ఆదేశించడంతో నటులు మురళీమోహన్, అలీలు మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు. గత నెల 31న మా ఎన్నికలు జరిగిన తీరును వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు దానిని కోర్టుకు సమర్పించారు.






