రేవంత్ రెడ్డి అరెస్ట్.. హైకోర్టులో పిటీషన్

 

నేడు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడంగల్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ సభను అడ్డుకుంటానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెండ్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేసి జడ్చర్లకు తరలించారు. అయితే ఈ అరెస్ట్ ను కాంగ్రెస్ తో పాటు ప్రజకూటమిలోని మిగతా పార్టీ నేతలు కూడా ఖండిస్తున్నారు. కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఇది కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమని మండిపడుతున్నారు. హౌస్ అరెస్ట్ చేస్తే సరిపోయేదానికి ఇలా అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయడం ఏంటంటూ విమర్శిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్.. హైకోర్టును ఆశ్రయించి లంచ్‌మోషన్‌ పిటీషన్ దాఖలు చేసింది. అయితే కోర్టు నుంచి ఏం తీర్పు రాబోతున్నదన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.