TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నేడు చంద్రగ్రహణం.. జాగ్రత్తలు...

Published on: Sat Apr 4, 2015 8:05AM

 

శనివారం మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7.17 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. కన్య, తుల, కుంభ, మిథున రాశులపై దాని ప్రభావం ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు. కన్యారాశిలోని హస్త నక్షత్రంపై గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. గర్భిణులు మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనం చేసి గ్రహణ సమయంలో సూర్యకాంతి శరీరంపై పడకుండా చూసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఆలయాలను మూసివేయనున్నారు. తిరుమల ఆలయాన్ని ఉదయం 9.30 గంటలకు మూసివేసి రాత్రి 8 గంటలకు తెరుస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణ జరిపాక ఆలయాలు తెరుస్తారు. గ్రహణం రోజున కూడా తెరచి వుండే శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.