TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆడపిల్లల్ని కాల్చేసిన కామాంధుడు

Published on: Wed Apr 1, 2015 10:19AM

 

ప్రేమ పేరుతో కామాంధులు చేస్తున్న దారుణాలకు అంతు లేకుండా పోతోంది. మహిళా రక్షణ చట్టాలు ఎంత పటిష్టంగా వున్నా అవి కామాంధులకు ఎంతమాత్రం భయం కలిగించడం లేదు. బెంగళూరులోని ఒక కాలేజీలో చదువుకుంటున్న గౌతమి అనే విద్యార్థినిని అదే కాలేజీలో అటెండర్‌గా పనిచేస్తున్న మహేష్ అనే వ్యక్తి కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. అతని బారి నుంచి తప్పించుకోవాలని ఆమె ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. బుధవారం నాడు ఆమె దగ్గరకి వచ్చిన మహేష్ తనను ప్రేమించాల్సిందేనని పట్టుబట్టాడు. ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో ఆమె మీద నాటు తుపాకితో కాల్పులు జరిపాడు. దాంతో గౌతమి అక్కడికక్కడే మరణించింది. ఈ కాల్పుల్లో శిరీష అనే మరో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది.