TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బొత్సకు లోకేష్ ఆత్మీయ పలకరింపు.. జగన్ కు చెంపపెట్టు!

Published on: Sat Mar 7, 2026 9:43AM

చంద్ర‌బాబు ప‌నై పోయింద‌ని.. ఆయ‌న‌కివే చివ‌రి ఎన్నిక‌లు అవుతాయ‌ని..  ఈ వ‌య‌సులో కృష్ణా రాా అనుకోకుండా  ఆయ‌న‌కెందుకీ రాజ‌కీయాలు. అలాగైనా ఆయ‌న‌కు పుణ్యం వ‌స్తుంది  క‌దా? అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన జగన్ కు  వైసీపీ సీనియ‌ర్ నేత బొత్స  ప‌ట్ల లోకేష్ చూపిన   వాత్స‌ల్యం చెంపపెట్టులాంటిదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే జగన్, లోకేష్ ఇద్దరూ పొలిటీషియన్సే.. కానీ మెచ్యూరిటీ, పరిపక్వల విషయంలో ఇద్దరికీ ఉన్న తేడా ఇది అంటూ.. మండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనై, కోలుకుని మండలికి వచ్చిన సందర్భంగా లోకేష్ ఆయనను ఆప్యాయంగా పలకరించి,  మా మాస్టారు బొత్స తిరిగి  స‌భ‌కు వ‌చ్చారు, సభలో ఆయనన చూడటం ఎంతో సంతోషంగా  ఉంద‌న్నారు లోకేష్. 

ఇటీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి  తీవ్రంగా  ఇబ్బంది  ప‌డ్డారు.  కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్  సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందుకే ష‌ర్మిళ.. జ‌గ‌న్ మానసిక పరిస్థితి ప‌ట్ల తనకు సందేహాలున్నాయని షర్మిల అంటారు.   ఏదో సినిమా డైలాగులో ఆయ‌న్ను ఎవ‌రికైనా చూపించండ్రా, అలా వదిలేయకండ్రా అని వైసీపీ శ్రేణులకు సూచించారు.   జ‌గ‌న్ ఎందుక‌ని ఇంత ప‌ర్వ‌ర్టెడ్ గా ఉన్నారు? మంచి చెడులు మ‌ర‌చి వ్యవహరిస్తారు?   చంద్ర‌బాబు వ‌య‌సుతో ఆయ‌న‌కేం ప‌ని? అంటూ పలు సందర్భాలలో ఆయనపై పలువురు విమర్శలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

 ప్రస్తుతం రాష్ట్రానికి   అనుభ‌వంతో కూడిన నాయ‌క‌త్వం  అవసరం అని ప్రజలు భావించారు. కనుకనే చంద్రబాబుకు అఘండ మెజారిటీతో అధికారం కట్టబెట్టారు.  ఆ విషయాన్ని పట్టించుకోకుండా జగన్ చంద్రబాబు విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరుకు.. లోకేష్ తన పరిణితితో సమాధానమిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.