Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోక్ అదాలత్ ప్రపంచ రికార్డ్
posted on: Nov 24, 2013 1:40PM

లోక్ అదాలత్ కేసుల పరిష్కారం విషయంలో ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒక్క శనివారం రోజే 28 లక్షలకు పైగా కేసులు పరిష్కరించింది లోక్ అదాలత్. 39 లక్షల పెండింగ్ కేసుల పరిష్కారం లక్ష్యంగా శనివారం విధ కోర్టుల్లో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఈ ఘనత సాధించారు.
ఈ సందర్భంగా సుప్రిం కోర్టులో మాట్లాడిన న్యాయమూర్తి జస్టిస్ పి సదాశివం, లోక్ అదాలత్ నిర్వహించే న్యాయమూర్తులు ఫిర్యాదు దారులను భయపెట్టి లేదా తప్పుదోవ పట్టించి కేసులు పరిష్కరించ వద్దని తెలిపారు. శనివారం రోజే మన రాష్ట్రంలో కూడా దాదాపు లక్షకు పైగా కేసులను పరిష్కరించారు.






