TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కల్లుకు మద్యం దెబ్బ

Published on: Sat Mar 24, 2012 11:10AM

రాష్ట్రంలోని కల్లుగీత కార్మికులకు పెద్ద సమస్య ఎదురయింది. హఠాత్తుగా వారు తీస్తున్న కల్లుకు డిమాండ్ తగ్గింది. దీనికి ప్రధాన కారణం మద్యాన్ని ఎమ్మార్పి రేట్లకే విక్రయించడం. గతంలో మద్యం ధరలు ఎక్కువగా ఉండేవి, ఎమ్మార్పీపై 40 నుంచి 50శాతం ఎక్కువగా విక్రయించేవారు. దీంతో పేద ప్రజలు మద్యానికి బదులు కల్లును ఎక్కువగా తాగేవారు. రోడ్డుపక్కన ఉన్న కల్లుపాకలన్నీ కల్లు ప్రియులతో కళకళలాడేవి. అయితే మద్యం ధరలు తగ్గిపోవడంతో ఇప్పుడు కల్లుపాకలు వెలవెలబోతున్నాయి. ప్రస్తుతం అనుకున్నంత వ్యాపారం సాగటం లేదని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్లు వ్యాపారం తగ్గిపోవడంతో కొందరు వ్యాపారులు కల్లు విక్రయానికి స్వస్తి చెబుతున్నారు.