Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ దృష్టిలో .. మద్యం అనారోగ్యం కాదు రాబడి వనరు
posted on: Jul 15, 2022 10:37AM
ఏ ప్రభుత్వమైనా ప్రజాసంక్షేమాన్నే ప్రధానంగా దృష్టిలో పెట్టుకుంటుంది. సంక్షేమ పథకాలకే పెద్ద పీట వేస్తుంది. అంతే తప్ప ప్రభుత్వానికి, ఖజానాకీ లాభసాటిగా వుంటుందని ఇబ్బందికర పథకాలను పని గట్టుకుని అమలు చేయరు. కానీ జగన్ ప్రభుత్వం అదే చేస్తోంది. ఎన్నికల్లో ఘనవిజయం సాధించడానికి మద్యపాన నిషేధాన్ని బ్రహ్మాస్త్రంగా ఉపయోగించిన వైసీపి ఆ తర్వాత దాన్నే కీలకంగా చేసుకుంది. ఒక్క మేలు తలపెట్టవోయి అన్నారు గాని జగన్ ప్రజలకు చేస్తున్న మేలు ఊహించడానికీ ఇబ్బందికరంగా వుంది. అసలు మద్యపాన నిషేధానికి సరికొత్త అర్ధం చెప్పిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఒక వంక నిషేధం అంటూనే బార్లకు కొత్త పాలసీతో అవకాశం కల్పించడం, మందుబాబులకు రిహాబిలిటే షన్ సెంటర్లను ఏర్పాటు చేస్తామనడం సిఎం గా జగన్ ప్రజలకు చేస్తున్న మేలు బయటపెడుతోంది.
ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరైనప్పటికీ రిస్క్ తీసుకుని మద్యం రేట్లను పెంచుతామని చెప్పిన వైసీపీ అధినేత, మద్యం తయారు చేసినా, అమ్మినా ఏడేళ్ల శిక్ష విధించేలా చట్ట సవరణ చేస్తామనీ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఆ హామీలు అన్ని గాలికి వదిలేసి కల్తి మద్యం మార్కెట్ లోకి తెచ్చి ప్రజల ప్రాణా లతో చలగాటం ఆడుతూ, ఇప్పుడు కొత్త మద్యం పాలసీ ని తెచ్చారు. ఏపీలో మద్యనిషేధానికి తూట్లు పొడుస్తున్నారన్న విపక్షాల విమర్శల్ని నిజం చేస్తూ ప్రభుత్వం బార్ల పాలసీని విడుదల చేసింది.
అదీ వచ్చే మూడేళ్ల కాలానికి ఈ విధానం అమల్లో ఉంటుంది. ఇప్పటికే మద్యంపై ఆదాయాన్ని చూపుతూ భారీ ఎత్తున అప్పులు తెస్తున్న ప్రభుత్వం ఇక తాము ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన కీలక హామీని అట కెక్కించడం ఖాయమని తేలిపోయింది. ప్రభుత్వం ప్రకటించిన బార్ల విధానంలో కీలక అంశాలున్నాయి. ఏపీలో కొత్త బార్ల విధానాన్ని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల కాలానికి వర్తిం చేలా ఈ విధానాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమల్లోకి తెస్తున్నారు. ఇప్పటికే బార్లకు ఇచ్చిన లైసె న్స్ లను ఆగస్టు వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం మరో నిర్ణయం ప్రకటించింది. దీంతో సాంకేతిక ఇబ్బందు లు రాకుండా ప్రయత్నించినట్లు తెలుస్తోంది..
మద్యపాన నిషేదాని కి మూడు దశల ప్రణాళిక రూపొందించామన్న వైఎస్ జగన్ సర్కార్ తొలి దశలో మద్యం దుకాణాల సంఖ్యను భారీగా తగ్గించడంతో పాటు ధరలు కనీవినీ ఎరుగని రీతిలో పెంచుతామని, అంతేకాదు మద్యం మహమ్మారి వల్ల కుటుంబాలు ఎలా నాశనమవుతున్నాయో వివరిస్తూ సినిమా థియేట ర్లు, టీవీల్లో ప్రకటనలు ఇస్తామన్నారు. రెండో దశలో మద్యపాన వ్యసనం నుంచి బయటపడాలనుకునే వారి కోసం ప్రతి జిల్లాలో రీ హాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి మంచి జీవితాన్ని అందిస్తామని చెప్పారు. ఇక చివరి దశలో మద్యం కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే అందుబాటులో ఉండేలా చూస్తామని చెప్పారు.
హామీలు అన్ని అధికారం కోసమే అని, ప్రజలకోసం కాదని, మద్యపాన నిషేధం అనే మాట కూడా అధి కారం కోసమే చెప్పిన మాటేనని మరోసారి నిరూపితమైంరని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మద్యం తాయారు చేస్తే ఏడేళ్ల శిక్ష అని చెప్పిన జగన్ ముందు వాళ్ల పార్టీ వాళ్ళనే అరెస్ట్ చేయసివస్తుందని దాని ఊసే ఎత్తడం లేదు. కల్తి మద్యం తో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అని ప్రజలు గోల పెడుతు న్నా, తమకేమి పట్టనట్టు కొత్త మద్యం పాలసీ ప్రవేశపెట్టడం జగన్ మోహనరెడ్డి అరాచక పాలన కి నిద ర్శనం. కొంత కాలం పొతే గడప గడపకి మద్యం అనే కొత్త పాలసీ కూడా తెస్తారని, అసలు మద్యం నుంచి వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖజానా లోకంటే, ప్రభూత్వ పెద్దల ఖజనాలలోకి ఎక్కువ వెళ్తున్నాయని, వాటి లెక్క ల్ని బయటపెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
గత ప్రభుత్వాల సమయంలో మద్యం ద్వారా తొమ్మిది వేల కోట్ల ఆదాయం వస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యం ఆదాయం రూ.22 వేల కోట్లకు పెరిగిందని విపక్షాల మాట. మద్యంపై వచ్చే ఆదాయం గతంలో కన్నా ఎన్నో రెట్లు పెరిగిందని, వచ్చే ఎన్నికల సమయానికి కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే లిక్కర్ అమ్ముతామని, అప్పుడే ఓట్లు అడుగుతామని చెప్పిన ప్రభుత్వం అసలు మద్య నిషేధం చేయ బోమని హమీ ఇచ్చి అప్పులు తెచ్చుకోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది


.webp)
.webp)


