Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏమయ్యా లోకేశం.. కొంచెమన్నా బుర్ర వాడు!
posted on: Jul 10, 2019 12:11PM

టీడీపీ ఘోర పరాజయం తరువాత దూకుడు పెంచిన నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా వైసీపీ మీద సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నేతలు కూడా లోకేష్ కి అదే రేంజ్ లో కౌంటర్లు ఇస్తున్నారు.
టీడీపీ హయాంలో తెచ్చిన ‘బడికొస్తా’ పథకం సైకిళ్లకు వైసీపీ ప్రభుత్వం రాజన్న బడిబాట స్టిక్కర్లు వేసి పంపిణీ చేస్తోందని లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శించిన సంగతి తెలిసిందే. "టీడీపీ సిద్ధం చేసి ఉంచిన బడికొస్తా సైకిళ్ళకి బడిబాట స్టిక్కర్! బాగుంది కానీ, ఎంత స్టిక్కర్ వేసినా టీడీపీ చేసింది పచ్చబొట్టులాంటి అభివృద్ధి. దాన్ని మరుగున పడేయడం మీవల్ల కాదు. గత ఐదేళ్ళూ మేము చేసిన వాటికి మీ స్టిక్కర్లు అంటించుకుంటూ పొతే మీకు వచ్చే ఐదేళ్ళూ చాలవు జగన్ గారూ!" అంటూ లోకేష్ ట్వీట్ చేసారు.
లోకేష్ ట్వీట్ కి వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ట్విట్టర్ వేదికగా ధీటైన కౌంటర్ ఇచ్చారు. "ఏమయ్యా లోకేశం నీ డబ్బుతో వేస్తున్నవా లేక చేస్తున్నావా ?? ప్రజల డబ్బే కదా ?? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బస్సుల పైన మీ నాన్న గారి ముఖరావిందం ఇప్పటికి దర్శనం ఇస్తారు అలా అని అవి మీవి కాదు కద?? కొంచం అన్న ఉన్న బుర్ర వాడండి" ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.






