TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఘటోత్సవంతో ప్రారంభమైన లష్కర్ బోనాల సందడి

Published on: Sun Jul 17, 2022 8:35AM

తెలంగాణలో ఆషాఢం బోనాల ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం సికింద్రాబాద్ లష్కర్‌ బోనాలు ప్రారంభమయ్యాయి. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తొలి బోనం సమర్పించారుతెల్లవారుజామున అమ్మవారికి తలసాని బోనం తొలి బోనం సమర్పించారు.

అనంతరం మహంకాళికి ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే మహంకాళి దేవాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి బోనాలు సమర్పిస్తున్నారు.  భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులంతా క్యూలైన్లలో వెళ్తూ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. లష్కర్‌ బోనాల సందర్భంగా జంటనగరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ఆంక్షలు రేపటి వరకు కొనసాగనున్నాయి.

మహంకాళి ఆలయానికి ఇవాళ పలువురు వీఐపీలు తరలిరానున్నారు.    సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు కాగా కరోనా కారణంగా గత రెండేళ్లుగా బోనాల సందడి కనిపించని సంగతి విదితమే. రెండేళ్ల తరువాత బక్తులను అనుమతిస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.  ఘ‌టోత్సవంతో లష్కర్ బోనాల సందడి మొదలైంది. తెల్లవారుజాము 4 గంటలకి అమ్మవారికి మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు నిర్వహించారు. అనంతరం సాకలు సమర్పించారు.  

కాగా బోనాల సందర్భంగా పలువురు ప్రముఖులు మహంకాళి దేవాలయాన్ని సందర్శించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, తదితరులు మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు.  రెండురోజులపాటు జ‌రిగే ఉత్సవాల్లో తొలిరోజు బోనాలు, రెండోరోజు రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. రంగం తర్వాత  అంబారు ఊరేగింపు ఉంటుంది.