జూబ్లీ బైపోల్.. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి

జబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎవరన్న విషయంలో ఇన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠ కు తెరపడింది. ఈ బైపోల్ లో తమ పార్టీ అభ్యర్థిగా దీపక్ రెడ్డిని ఖరారు చేస్తూ పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 15)న ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే.. ముందుగా బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ప్రకటించింది. ఆ తరువాత కాంగ్రెస్ సైతం పలు పేర్లను పరిశీలించి.. చివరకు అభ్యర్థిగా స్థానిక యువకుడు నవీన్  యాదవ్ ను ప్రకటించింది.

కానీ బీజేపీ మాత్రం అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడింది. పలు పేర్లు పరిశీలించింది. రాష్ట్ర నాయకులలో సయోధ్య కొరవడటంతో పార్టీ అభ్యర్థి ఎంపిక కమలం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. అయితే చివరకు ముందు నుంచీ అనుకుంటున్న లంకల దీపక్ రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేసింది. లంకల దీపక్ రెడ్డి గత ఎన్నికలలో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికలో ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల కన్నా వెనుకబడి మూడో స్థానంలో నిలిచారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu