Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సైబీరియాలో నరకం నోరు తెరిచింది!
posted on: Jun 22, 2022 2:13PM
పాత బంగ్లా చాలాకాలం ఎవ్వరూ అటు వెళ్లరు. ఒకరోజు వేరే ప్రాంతంవాడు వచ్చి తలుపులు పగలగొట్టి లోనికి వెళతాడు..హఠాత్తుగా హాహాకారాలు వినపడతాయి..అతను భయపడతాడు మాటపడిపోతుంది!.. ఇదో తెలుగు హారర్ చిత్రం తాలూకు సీన్! ఆమధ్య ఎక్కడో రోడ్డు హఠాత్తుగా కుంగిపోయిందని అందరూ భయపడ్డారు. ఇలాంటివి అక్కడక్కడా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీన్ని గురించి ఎంతో చర్చించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతయినా వుంది. భూమి కుంగిపోతోందా?! అన్న ఊహే భయానకం.
నిజంగానే భూమి కుంగిపోవడం, అది మెల్లగా పెద్దది కావడం చూడ్డం జరిగితే గుండె కొట్టుకుంటుందా? రష్యా యాకుటియాలో బొటగయికా ప్రాంత నివాసితులు హఠా త్తుగా భూమి కుంగిపోవడాన్ని చూసి భయ పడుతున్నారు. ఇది పాతాళానికి నరకానికి ద్వారంగా వారు భావిస్తు న్నారు! బొటగయికా గ్రామం సైబీరి యాలో వుంది. ఆ గ్రామంలో నేల కుంగడం నెమ్మదిగా పెరుగుతోందిట. భూమి ఇలా పాతాళంలోకి కుంగి పోవడం వింటేనే గుండె ఆగినంత పనవుతుంది. అయితే దురదృష్టమేమంటే భూమి పొరల కదలికతో కుంగుబాటు పెరగడం అనేది నిలువరించలేనిది. ప్రస్తుతం భూమి కుంగడం ప్రతీ ఏడూ సుమారు 20 నుంచి 30 మీటర్లు పెరుగుతోంది. ఇది ఎప్పటికి ఆగుతుందనేది అంచనా వేయడం దుర్లభమని అంటు న్నారు. అక్కడి వారు భూమి పాతాళంలోకి జారిపోవడాన్ని చూస్తూ ఎలా బతికి వున్నారో!
అంతటి వేగంతో భూమి కుంగి బిలం స్థిరపడే వరకు దాని చుట్టూ ఉన్న ప్రతిదానిని లోనికి లాగేసుకుం టోంది. స్థానికులు ఈ సైట్ నుండి వస్తున్న భయంకర శబ్దాలను విన్నామని చెబుతున్నారు. ఈ ప్రాంతం లో నివసించే యాకుట్ ప్రజలు అతీంద్రియ శక్తులపై విశ్వాసం మెండుగా ఉన్నవారు. 2.58 మిలియన్ సంవత్సరాల క్రితం క్వాటర్నరీ మంచు యుగంలో సైట్‌లోని భూమి శాశ్వతంగా మనుషులు సంచరించడానికి వీలులేకుండా చేసింది.
1960లలో అటవీ ప్రాంతాన్ని నేలమట్టం చేసిన ప్పుడు, సూర్యరశ్మి భూమిని చేరు కుని అది వేడెక్కడం ప్రారంభించింది. ఫలితంగా నేలలోని మంచు మెల్లగా కరిగి నేల గట్టితనం పోవడం తో క్రమేపీ పెద్ద పెద్ద గోతులు ఏర్పడం మొదలయి ఇపుడు ఎంతో పెద్ద గొయ్యిగా వూహించనంత లోతుకి వెళిపోతోంది! ఇదంతా భూగోళం వేడెక్కుతుండడంతోనే జరుగు తోందని పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. భూగోళం వేడెక్కే కొద్దీ ఇలాంటి వూహించని భయానక పాతాళ బిలాలను చూడవలసి వస్తుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఇక సైబీరియాలోని బటగాయికా లో కుంగిన భూమి విషయానికి వస్తే, ఇది 1980ల్లోనే ఆరంభమయినపు డు కిలోమీటరు పొడవు, 86 మీటర్ల లోతు వుండేది. నోరు తెరుచుకున్న నేల పొరలు లక్షా 20 వేల నుంచి రెండు లక్షల సంవత్సరాల నాటివని అంచనా! యూరేషియాలో మూత లేని అతి పురాతన గొయ్యి ప్రాంతంగా భూగర్భ శాస్త్రవేత్తలు దీనిని పేర్కొంటున్నారు.






