Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ నిజం.. దోషులకు శిక్ష పడాల్సిందే.. సీపీఐ నారాయణ
posted on: Feb 12, 2026 12:10PM
.webp)
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టులో విచారణ సాగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు మాట్లాడకుండా ఉంటే మంచిదన్నారు. ఒక వేళ మాట్లాడినా నోరు అదుపులో పెట్టుకో వాలన్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం నిజం. ఇందులో సందేహానికి తావు లేదు. ఇప్పుడు జరగాల్సిందేంటంటే.. తప్పు చేసిన దోషులకు శిక్ష పడటమేనని నారాయణ అన్నారు. ఈ విషయంలో తప్పు చేసిన అధికారులు, టీటీడీ మాజీ ఈవో ఎవరినీ వదలకూడదన్న నారాయణ, రాజకీ య లబ్ధి కోసమే రాజకీయపార్టీలు లడ్డు వివాదంపై రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దని నారాయణ రాజకీయనేతలకు సూచించారు.



.webp)


