Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నెయ్యి కల్తీపై సిట్ విచారణ!
posted on: Sep 24, 2024 12:02PM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన జీవో ఈ సాయంత్రంలోగా విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో డీజీపీ ద్వారకాతిరుమలరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా చంద్రబాబుతో నిన్న రాత్రి భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం కూడా వీరు మరో సారి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీల్లో సీట్ చీఫ్ గా ఎవరిని నియమించాలన్న విషయంపై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజి ఐజి సర్వసేష్ట త్రిపాఠిని నియమించారు. సిట్ డిఐజిగా విశాఖ రేంజ్ డిఐజి గోపీనాథ్ జెట్టి, సీట్ ఎస్పీగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు నియమితులయ్యారు.


(1).webp)



