Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కుక్కకు డీఎన్‌ఏ టెస్ట్..
posted on: Mar 20, 2021 2:33PM
ఆస్తుల కోసం అన్నదమ్ముల గొడవ పడడం వింటుంటాం. ఏదైనా వస్తువు కోసం గొడవ పడుతుంటారు. కానీ ఇద్దరు వ్యక్తులు ఒక కుక్క నాదంటే నాదంటూ గొడవ పడడం చూశారా.. చూసేవుంటారు కానీ ఈ కేసులో ఒక కొత్త కోణం ఉంది. అదేంటంటే...
గత ఏడాది ఆగస్టులో ఓ లాబ్రాడర్ జాతి కుక్క.. తమదేనంటూ షాదాబ్ ఖాన్, కార్తీక్ శివహరేలు గొడవ పడ్డారు. విషయం పెరిగి పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఇద్దరు వ్యక్తులు కుక్క ఫిర్యాదు ఇవ్వడంతో కుక్క ఎవరితో తేల్చలేక పోలీసులు తలలు బాదుకున్నారు. ఎంతగా విచారణ చేసినా, అసలు యజమానెవరో పోలీసులు తేల్చలేకపోయారు. చివరకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని నిర్ణయించారు.
ఎక్కడైనా ఒక వ్యక్తి ఎవరికి జన్మించాడో, తన పుట్టుపూర్వోత్తరాలేంటో తెలుసుకోవడానికి డీఎన్‌ఏ టెస్ట్ చేస్తారు. కానీ ఈ కేసులో కుక్క యజమాని ఎవరో తెలుసుకోవడానికి డీఎన్‌ఏ టెస్ట్ పరీక్ష చేశారు. టెస్ట్ తర్వాత కుక్క యజమానిని తేల్చారు పోలీసులు.
కుక్కను తాను పచ్‌మడీ ప్రాంతం నుంచి కొనుగోలు చేశానని షాదాబ్ తెలిపారు. దీంతో కుక్క నుంచి, కుక్క తల్లి నుంచి శాంపిళ్లను సేకరించి డిసెంబర్‌లో డీఎన్‌ఏ పరీక్షల కోసం హైదరాబాద్ పంపారు. ఆ ఫలితాలు ఇప్పుడు వచ్చాయి. కుక్క యజమాని షాదాబేనని తేలింది. డీఎన్‌ఏ పరీక్షల కోసం రూ.50 వేలు ఖర్చు పెట్టాను. చివరకు నా కుక్క నాకు దక్కింది. చాలా సంతోషంగా ఉంది అని షాదాబ్ ఖాన్ తెలిపారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ హోషంగాబాద్ లో జరిగింది.






