Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కుప్పంలో వైసీపీ ఖతం
posted on: Jul 31, 2024 5:27PM
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు.. టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. మరికొందరు పార్టీ నుంచి జంప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇటు కుప్పంలో వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. కుప్పం వైసీపీ నేతలు టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి సమక్షంలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, 15 మంది ఎంపీటీసీలు టీడీపీలో చేరారు.






