TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాకు అంత  సీన్ లేదు

Published on: Sat May 13, 2023 10:45AM

 కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత జెడిఎస్ పార్టీ కింగ్ మేకర్ కాబోతుందని వచ్చిన వార్తలను అదే పార్టీ ఖండిస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జేడీఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బెంగళూరులోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒకవేళ కర్ణాటకలో హంగ్ వస్తే జేడీఎస్ కింగ్ మేకర్ పాత్రను పోషిస్తుందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీతోనూ టచ్ లో లేనని... ఏ పార్టీ కూడా తనను సంప్రదించలేదని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ పార్టీని నిరాశ పర్చాయన్నారు. కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని వచ్చిన వార్తలను ఆయన కొట్టివేశారు.

రెండు, మూడు గంటలు గడిస్తే క్లియర్ పిక్ఛర్ వస్తుందని కుమారస్వామి చెప్పారు. రెండు జాతీయ పార్టీలకు ఎక్కువ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయని... తమ జేడీఎస్ కు 30 నుంచి 32 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పాయని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం తమ పార్టీ అవసరం ఇతర పార్టీలకు రాకపోవచ్చని చెప్పారు. తమది ఒక చిన్న పార్టీ అని... తనకు అంత డిమాండ్ లేదని వ్యాఖ్యానించారు.