TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థ.. మంత్రులు బ్రోకర్లు.. కేటీఆర్

Published on: Fri Feb 27, 2026 9:30AM

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.  ముఖ్యమంత్రి వెయ్యి కోట్ల రూపాయలను  గాంధీ కుటుంబానికి  పంపిస్తానని ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి నిధుల సమీకరణ కోసమే  ఇళ్లను కూల్చివేసి, భూములను అమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు పేదల గృహాలను నేలమట్టం చేస్తూ, మరోవైపు హైదరాబాద్‌లో ముఖ్య మంత్రి తన రెండో  పాలస్  నిర్మాణానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు.  పేదల ఇళ్లను కూల్చివేస్తూనే తన వ్యక్తిగత కోట నిర్మాణం లో కేవలం గోడలకే తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు.  

ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మూడో ఇల్లు నిర్మించుకుంటున్నారనీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పదవ కంపెనీ స్థాపించి కమీషన్లు వెనకేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పేదల జీవితాలను రోడ్డున పడేస్తూ, అధికారం లో ఉన్నవారు తమ వ్యక్తి గత ఆస్తుల పెంపుపై దృష్టిపెట్టారనీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కంపెనీలాగా, మంత్రులు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు.  ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కేటీఆర్ విమర్శలు, ఆరోపణలపై ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది.