TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

20 నుంచి కేటీఆర్ జిల్లాల పర్యటన

Published on: Mon Mar 17, 2025 12:34PM

బీఆర్ఎస్ రాష్ట్రంలో మళ్లీ పట్టు సాధించాలన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్క్భాన్ని ఇందుకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు జిల్లాల పర్యటనకు సమాయత్తమౌతున్నారు. ఈ నెల 20 నుంచి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పర్యటించాలని నిర్ణయించారు.

ఇందుకు సంబంధించి రోడ్ మ్యాప్ ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  దీనిలో  భాగంగా కేటీఆర్ అన్ని జిల్లాలలో పార్టీ ముఖ్యనాయకులు,   కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్‌లో పార్టీ సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులతో విస్తృతస్థాయి సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా త్వరలో వరంగల్‌లో లక్షలాది మందితో పార్టీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.