Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ లాగే కేటీఆర్ అహంకారపూరిత డైలాగులు
posted on: Jun 12, 2025 3:23PM
.webp)
కేసీఆర్.. వెంట్రుక కూడా పీకలేరు
గతంలో జగన్ కూడా సేమ్ డైలాగ్
తర్వాత ఏమైందీ???
వెంట్రుక ఈ డైలాగ్ లీడర్ జనానికి
ఎందుకంతగా కలసి రాదు!?
మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా ఇది ఇంద్రాలో చిరంజీవి డైలాగ్.. సరిగ్గా అలాగే వెంట్రుకే కదా పీకలేరన్న డైలాగ్ కొడితే.. ఏకంగా మిమ్మల్నే అధికారంలోంచి పీకేస్తా.. ఇది ప్రెజంట్ పొలిటికల్ సిట్యువేషన్. మాములుగా పాములు పగబడతాయని అంటారు. సరిగ్గా అలాగే వెంట్రుకలు కూడా ఈ లీడర్ జనాల మీద పగబట్టాయా? అంటే నిజమేమో అనుకోవలసి వస్తోంది. మొన్నటి ఏపీ ఎన్నికల సమయంలో జగన్ పాపులర్ డైలాగ్స్ ఏవని చూస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్, నా వెంట్రుక కూడా పీకలేరు.. ఇవన్నీ అప్పట్లో బాగా వైరల్.
తీరా ఎన్నికలయ్యాక జరిగిందేంటయ్యా అంటే జనం ఆయన్ను వై నాట్ 11 అంటూ తీసి అవతల పడేశారు. నన్నెవరూ ఏమీ పీకలేరు, పీకలేరు అని పదే పదే అన్న పాపానికి.. ఏకంగా అధికారంలోంచి పీకేయడమే కాకుండా.. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఈ రోజున ఆయన ఎక్కడికైనా వస్తుంటే జనం చెప్పులు కూడా వేస్తున్నారు. తాజాగా పొదిలి పొగాకు రైతులకు వెన్నుదన్నుగా వచ్చినట్టు చెప్పిన జగన్ ర్యాలీలో ఈ ఘటన నమోదైంది. పొదిలి ప్రాంత పొగాకు రైతు మీద మాత్రమే వల్లమాలిన అభిమానం కుమ్మురించడానికి వచ్చిన జగన్ ఇలా అభాసు పాలయ్యారు... అది వేరే విషయం.
ఇక్కడ చెప్పొచ్చే నీతి ఏమిటంటే.. ఓవర్ యాక్షన్ తో కూడిన డైలాగులు , అతిశయంతో కూడిన సంభాషణా చాతుర్యాలు జనం పెద్దగా నచ్చడం లేదు. మరీ ముఖ్యంగా ఓటు వేసే సమయంలో ఓటరు జనానికి ఇవన్నీ వారి వారి ఆలోచనల్లో చక్కర్లు కొడుతూ.. ఆ పార్టీకి కాకుండా ప్రత్యర్ధి పార్టీకి ఓటు వేసేలా చేస్తున్నాయ్.
ఈ విషయం జగన్ విషయంలో ఒక సారి ప్రూవ్ అయినా సరే కేటీఆర్ ఇదేమీ గుర్తించకుండా తన తండ్రి కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేరని అనడం... జనం కళ్లారా కంటున్నా చెవులారా వింటున్నారు.. ఇది వచ్చే రోజుల్లో మరింత సమస్యలకు దారి తెచ్చేలా కనిపిస్తోంది. రీసెంట్ గా వైనాట్ వన్ సెవెంటీఫైవ్ అనే ఈ స్లోగన్ రాసిచ్చినోడ్ని తన్నాలంటూ ఒక వైసీపీ నేత అనడం తెలిసిందే. జగన్ కి స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో ఏమో తెలీదు గానీ ఈ దిక్కుమాలిన ఓవరాక్షనే బెడిసికొట్టిందంటారు.
ఇప్పుడీ వింత వితండ వాదాన్ని కేటీఆర్ అందిపుచ్చుకోడాన్ని గులాబీశ్రేణులు కమాన్ గుస గుస అంటున్నాయ్. ఈయనకేమైనా పిచ్చిలేచిందా? ఇలాంటి డైలాగులు ఎందుకు కొడుతున్నారు. గతంలో జగన్ కి జరిగిన శాస్తి కనీసం గుర్తు కూడా లేదా అని మాట్లాడుకుంటున్నారట. ఈ ట్విట్టర్ రాజాకి ట్వీట్ కి ఏది బాగుంటే అది పెట్టడం.. నోటికి ఏది బాగుంటే అది మాట్లాడ్డం అలవాటైపోయింది. ఈ రోగానికి మందేదని అర్ధంగాక సొంత పార్టీ వారే బుర్ర గోక్కుంటున్నారట.






