Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేటీఆర్, రేవంత్‌లు మోదీని కుమ్మేశారుగా...
posted on: Nov 19, 2021 11:14AM
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై మంత్రి కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వేరువేరుగా స్పందించారు. అధికారంలో ఉన్న వారి పవర్ కంటే ప్రజల పవర్ చాలా శక్తివంతమైనది. భారతీయ రైతులు నిరంతర ఆందోళనతో తాము అనుకున్నది సాధించి దీనిని నిరూపించారు. జై జవాన్ జై కిసాన్.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

మూడు వ్యవసాయచట్టాలపై నిర్ణయాన్ని మొదటి రోజే వెనక్కి తీసుకుంటే రైతుల ప్రాణాలు మిగిలేవని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 13 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు అకుంఠిత దీక్షతో పోరాటం చేశారన్నారు. ప్రభుత్వం మెడలు వంచి.. నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేలా పోరాటం చేశారని తెలిపారు. దేశ సరిహద్దుల్లో సైన్యం ఎలా పోరాటం చేస్తారో.. రైతులు కూడా అదే స్ఫూర్తితో ఉద్యమం చేశారన్నారు. దేశంలో గుజరాత్ నుండి బయలు దేరిన నలుగురు దేశాన్ని అక్రమించుకోవలని చూస్తున్నారని మండిపడ్డారు రేవంత్‌రెడ్డి.
వ్యవసాయం అదాని..అంబానీకి అమ్మకానికి పెట్టాలని చూశారన్నారు. ఇందిరాగాంధీ పుట్టిన రోజున నల్ల చెట్టాల రద్దుతో రైతులు విజయం సాధించారని టీపీసీసీ చీఫ్ అన్నారు. వందలాది మంది రైతుల ప్రాణాలు పోవడానికి కారణం అయిన నరరూప రాక్షసుడు మోదీ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. రైతులు మోదీని క్షమించరన్నారు.
వ్యవసాయం సంక్షోభానికి కారణం మోదీ, కేసీఆర్‌లే అని అన్నారు. పార్లమెంట్‌లో చట్టానికి అనుకూలంగా కేసీఆర్ ఓటేశారని గుర్తుచేశారు. సభలో చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసే ధైర్యం లేదు కానీ.. క్రెడిట్ మాత్రం తనదే అని అంటున్నారని.. అది రైతులను అవమానించడమే అని రేవంత్ రెడ్డి అన్నారు.






