TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ శంకుస్థాపన.. కేసీఆర్ వెళ్లరా? కేటీఆర్ ను పంపిస్తారా?

Published on: Fri Oct 16, 2015 4:55PM


 

ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబే స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని చెప్పడంతో మరింత ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబు అయితే చంద్రబాబే కేసీఆర్ ను స్వయంగా ఆహ్వానించినా కేసీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరవరూ అనే సంకేతాలే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ తన తరుపున కొడుకు కేటీఆర్ ను ఈ కార్యక్రమానికి పంపించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్ర వ్యవహారాలను కేటీఆరే చూస్తుండటంతో కేంద్రంలో కూడా కేటీఆర్ ను ప్రమోట్ ను చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈనేపథ్యంలోనే శంకుస్థాపనకు ప్రధాని నరేంద్రమోడీ, ఇతర దేశాల ప్రధానులు. అంతేకాదు పలు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు, ఎంపీలు, మంత్రులు వస్తారు.. జాతీయ నాయకులతో మాటమంతీ కలిపే అవకాశం ఉంటుంది కాబట్టి కేసీఆర్ ఈకార్యక్రామానికి కేటీఆర్ ను పంపించాలని ఆలోచిస్తున్నట్టు అనుకుంటున్నారు. అంతేకాదు ఇప్పటికే ఏపీ మంత్రులు కేటీఆర్ ను ఆహ్వానించగా అందుకు ఆయన కూడా వస్తానని తన సముఖత వ్యక్తం చేశారట. దీనితో పాటు ఆయన పలు మీడియా సమావేశాల్లో కూడా రెండు రాష్ట్రాలు అభివృద్ధి దిశగా పోటీపడాలని.. ఏపీ రాజధానికి మద్దతు తెలుపుతున్నానని చాలాసార్లు చెప్పారు.