Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేటీఆర్కు మరోసారి ఏసీబీ నోటీసులు
posted on: Jun 13, 2025 3:46PM
.webp)
ఫార్ములా-ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం జూన్ 16న 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. గత బీఆర్ఎస్ అధికారంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా వుండగా హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. రాజధాని నగరం హైదరాబాద్ నడిబొడ్డున ఓవైపు హుస్సెన్ సాగర్, మరోవైపు కొత్త సచివాలయం మధ్య ఎన్టీఆర్ గార్డెన్ నుండి ఐమాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్ల మేర ఈ కారు రేస్ సాగింది.
ఇందుకోసం ప్రత్యేకంగా రోడ్డును సంసిద్దం చేసారు. ఫిబ్రవరి 11, 2023 లో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలకు అసెంబ్లీ ఎన్నికల వేళ అక్టోబర్ 2023లో ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ రూ.55 కోట్లను ఎఫ్ఈవో కు చెల్లించింది. ఈ డబ్బులు చెల్లింపులోనే అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆర్థిక శాఖ నుండి ముందస్తు అనుమతి లేకుండానే డబ్బులు చెల్లించారని అంటోంది. అంతేకాదు విదేశీ సంస్థకు నిధుల చెల్లింపు విషయంలోనే ఆర్బిఐ నిబంధనలు పాటించలేరని తమ విచారణలో తేలినట్లు చెబుతోంది.



.webp)


