Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మా అల్లుడు వెరీగుడ్డు: సూపర్‌స్టార్ కృష్ణ
posted on: May 5, 2014 11:20AM
.jpg)
అల్లుడు గారు ఎన్నికలలో పోటీ చేస్తుంటే మామగారు అల్లుడి గెలుపు కోరుకోవడం మామూలే. మన సూపర్‌స్టార్ కృష్ణ కూడా తన మామగారి మనసును బయటపెట్టారు. కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ గుంటూరు పార్లమెంట్ నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు. చాలా మంచోడు, నలుగురికీ ఉపయోగపడేవాడైన మా అల్లుడికి ఓటేసి గెలిపించండి అని మామగారి హోదాలో కృష్ణ ఓటర్లను రిక్వెస్ట్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ అభ్యర్థిగా గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న తన అల్లుడు గల్లా జయదేవ్‌ను గెలిపించాలని కృష్ణ తన అభిమానులను, గుంటూరు లోక్‌సభ ఓటర్లకు పిలుపునిచ్చారు. దేశంలో ఓ మంచి పారిశ్రామికవేత్తగా జయదేవ్ ఎంతో పేరు తెచ్చుకున్నారని చెప్పారు. అమర్‌రాజా గ్రూపు అధినేతగా పరిశ్రమలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తారని సూపర్‌స్టార్ కృష్ణ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.






