Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దాడి చేసింది మా వాళ్లే: వైసీపీ ఎమ్మెల్యే
posted on: Apr 18, 2019 3:11PM

ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు రణరంగాన్ని తలపించాయి. చాలా చోట్ల ఒకరిపై ఒకరు భౌతికంగా దాడి చేసుకున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లా TNSF అధ్యక్షుడు తిరుమల నాయుడిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేసులో నిందితులు తనవాళ్లేనని. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంగీకరించారు. గురువారం ఈ కేసు విషయమై మీడియాతో మాట్లాడిన కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ కేసులో నిందితులు తన అనుచరులేనని, దీనిలో రెండో ఆలోచనకు తావు లేదన్నారు. తానేమీ దాచి పెట్టడం లేదని.. ఈ కేసులో అరెస్టైన వారంతా ఎన్నికల్లో తనతోపాటు పనిచేసిన వారేనన్నారు. అయితే.. తిరుమలనాయుడిపై దాడి తన వాళ్లే చేశారన్న దానిపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయన్నారు. కానీ పోలీసులు చెబుతున్నారు కాబట్టి నమ్ముతున్నానన్నారు.






