కలకత్తాలో బాంబ్ బ్లాస్ట్

 

ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ను అరెస్ట్ చేసి 48 గంటలు కూడా గడవక ముందే దేశం ఉలిక్కి పడింది. దేశంలో ప్రదాన నగరాల్లో ఒకటైన అత్యంత రద్దీగా ఉండే కలకత్తాలో ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు.

కలకత్తాలోని చాందినీ చౌక్ ఎదుట శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. పేలుడు విషయం తెలుసుకున్న రాష్ట్ర యంత్రాంగం వెంటనే తనిఖీలు చెపట్టింది. మరో రెండు బాంబులను కనిపెట్టి నిర్వీర్యం చేసింది.

ఈ ఘటన దేశ హోం శాఖ అప్రమత్తమయ్యింది. దేశంలోని ప్రదాన నగరాలతో పాటు సున్నిత ప్రాంతాలు అత్యంత రధ్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu