Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైద్య విద్యార్థిపై హత్యాయత్నం
posted on: Nov 14, 2013 7:48AM

వైధ్యకళాశాలలో దారుణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రనికి చెందిన ఓ వైద్య విద్యార్థిపైన తోటి విద్యార్థులే పెట్రోలు పోసి నిప్పంటించిన సంఘటన చోటు చేసుకుంది. కర్నాటక రాష్ట్రంలోని కోలార్ వైద్య విశ్వవిద్యాలయంలో ఈ దారుణం జరిగింది. బాధితుడు వైద్య విద్యార్థి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి గ్రామానికి చెందిన కామేష్ సాయిప్రసాద్.
మంగళవారం రాత్రి కొందరు సహ విద్యార్థులు కామేష్ పై పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలు అయిన అతనిని దగ్గర్లోని సెయింట్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. అరవై శాతం గాయాలతో కామేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పైన దాడి చేసింది మన రాష్ట్రానికి చెందినవారేనని అనుమానిస్తున్నారు. కామేష్ తల్లిదండ్రులు హైదరాబాదులో న్యాయవాదులుగా పని చేస్తున్నారు.





