కోహ్లీ ... కింగ్  కోహ్లీయే!

దేశంలో క్రికెట్ పిచ్చికి అంతులేదు. గ‌తంలో స‌చిన్‌, ఇపుడు విరాట్ పిచ్చి. విరాట్ కోహ్లీని ఓట్టినే విరాట్ అన్నా, కోహ్లీ అన్నా స‌హించ‌లేనంత ఆగ్ర‌హం. కింగ్ కోహ్లీ అనాల్సిందే. ఇపుడు తెర‌మీద దేవుడు అత‌నే. కోహ్లీ రావ‌డంతోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో స‌చిన్‌ని మ‌రిపించాడ‌న్న టాక్ బాగా ఉంది. వాస్త‌వ‌మే. మ‌నోడు ఫుల్ ఫామ్‌లో ఉన్న రోజుల్లో ప‌రుగుల వ‌ర‌ద‌నే సృష్టించాడు. సూప‌ర్ బ్యాటర్ అన‌గానే ఫోర్లు, సిక్స్‌లు కొట్టడం కాదు, చూడ‌ముచ్చ‌టైన క‌వ‌ర్ డ్రైవ్‌లు, హుక్ షాట్స్‌తో ఫోర్లు కొట్ట‌డంలోనే అస‌లు స‌త్తా బ‌య‌ట ప‌డుతుంది. అంతేకాదు వికెట్ల మ‌ధ్య పులిలా ప‌రిగెడుతూ ప్ర‌త్య‌ర్ధుల ఫీల్డ‌ర్ల‌కు వీడెవడ్రా బాబూ చీటికీ మాటికీ ర‌న్ తీసుకుంటాడు అని బెంబేలెత్తించే స‌త్తా ఇటీవ‌లి కాలంలో కోహ్లీయే చూపించాడు. అందుకే  కోహ్లీ కింగ్ కోహ్లీ అయ్యాడు. 

ఆడుతున్న‌ది గ‌ల్లీ క్రికెట్‌, రంజీ మ్యాచ్‌లూ కాదు అంత‌ర్జాతీయ టోర్నీలు క‌నుక ఒక ప్లేయ‌ర్ జీవితంలో  ఫిట్నెస్ , ఏకాగ్ర‌త కూడా అంతే ప్రాధాన్య‌త సంత‌రించుకుంటాయి. అది కోహ్లీకీ వ‌ర్తిస్తుంది. ప‌దేళ్ల పాటు అనేక టోర్నీల్లో, అనేక ప్రాంతాల్లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన బ్యాట‌ర్ ఎవ‌ర‌యినా స‌రే ఆ త‌ర్వాత కాస్తంత వేగాన్ని త‌క్కువే  ప్ర‌ద‌ర్శిస్తారు. ప్ర‌తీ మ్యాచ్ అప్పుడే టీమ్‌లోకి వ‌చ్చిన పిల్లాడిలా మారి ఆడాలి. అంతే వేగాన్ని, అంతే ప‌రుగుల దాహాన్ని ప్ర‌ద‌ర్శించాలి. సుమారు ప‌న్నెండేళ్లు ఆడిన‌వారికి కాస్తంత దూకుడు త‌గ్గుతుంది. స‌చిన్ కావ‌చ్చ‌, అంత‌కుముందు గ‌వాస్క‌ర్‌, క‌పిల్, ర‌విశాస్త్రి, శ్రీ‌కాంత్ కావ‌చ్చు. ఎవ‌రయినా కెరీర్‌లో ఏదో ఒక ద‌శ‌లో కొంత త‌గ్గాల్సి వ‌స్తుంది. దానికి అనేక కార‌ణాలు ఉండ‌వ‌చ్చు. 

2014, 2019 మధ్య ఐదేళ్లపాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన బ్యాట్స్‌మన్, కానీ అప్పటి నుండి కష్టకాలంలో పడిపోయిన బ్యాట్స్‌మన్ గురించి ఊహించిన గందరగోళానికి చాలా తక్కువ సాక్ష్యం ఉంది. అతను దాదాపు 33 నెలలుగా అంతర్జాతీయ సెంచరీ చేయలేదనేది  జరగవచ్చు.  ఏ సందర్భంలోనైనా, మూడు అంకెల నాక్, అయితే, ప్రతిష్టాత్మకంగా  చేప‌డ‌తారు, ఇది ఒక మైలురాయి. ఒక బ్యాట్స్‌మెన్  విలువను కేవలం మూడు అంకెలపైనే కొలవలేం.  కాబట్టి అలాంటి విజయాన్ని సాధించకపోవడం  గొప్ప పతన మేమీ కాదు.

కోహ్లీ ఆసియాక‌ప్‌కి అస‌లు జ‌ట్టులోకి ఎంపిక అవుతాడా అని దేశ‌మంత‌టా క్రికెట్ వీరాభిమానులు అనుమానించారు. అయ్యో మావాడు లేకుండా టీమ్ ఏమిటి అని బాధ‌ప‌డిన‌వారూ ఉన్నారు. కానీ ఊహించ‌నివిధంగా మ‌ళ్లీ కింగ్ జ‌ట్టులోకి వచ్చాడు. అదే ఫిట్నెస్‌, అదే వేగంతో ఆడుతున్నాడు. త‌న వందో టీ 20 మ్యాచ్‌లో మ‌ళ్లీ బ్యాట్‌తో బౌల‌ర్ల‌కు గ‌ట్టి స‌మాధాన‌మే చెప్పాడు. తాను మ‌ళ్లీ ప‌రుగులవ‌ర‌ద సృష్టించ‌గ‌ల‌న‌న్న న‌మ్మ‌కం అభిమానుల‌కు, అధికారుల‌కూ తెలియ‌జేశాడు 

పాకిస్తాన్‌పై, సున్నాపై సెకండ్ స్లిప్‌లో త‌ప్పించుకున్న‌ తర్వాత, కోహ్లీ 34 బంతుల్లో 35 పరుగులు చేశాడు, ఇది ఒంటరిగా టీ20 క్రికెట్‌లో ఫర్వాలేదనిపించినప్పటికీ, 148 ఛేజింగ్‌లో భారత్ విజయంలో కీలకమైనది.

హాంకాంగ్‌పై, 2022 ఆసియా కప్‌లో కోహ్లి అర్ధశతకం సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అతను ఇప్పుడు టోర్నమెంట్‌లో అత్యధిక పరుగుల స్కోరర్‌గా కూడా ఉన్నాడు.  హాంగ్‌కాంగ్‌పై ఈ అర్ధ సెంచరీ గత నెలలో అతని భయంకరమైన ఇంగ్లండ్ పర్యటన తర్వాత కోహ్లీకి పెద్ద ఉపశమనం కలిగించింది, అక్కడ అతను తన 6 ఇన్నింగ్స్‌లలో దేనిలోనూ 20 దాటలేకపోయాడు. కోహ్లీ 44 బంతుల్లో అజేయంగా 59 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో, అతను ఒక బౌండరీని సాధించాడు, కానీ అతను 3 అనూహ్యంగా  కొట్టిన సిక్సర్‌లను కొట్టాడు, 134 స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. మొత్తంమీద, రెండు ఇన్నిం గ్స్‌ లలో అతను 94 యొక్క భారీ సగటుతో 94 పరుగులు చేశాడు.

ఒక్క‌సారి 2018లోకి వెళితే.. 30ఏళ్ల కోహ్లీ ఇంగ్లండ్‌లో విజృంభించాడు. రెండు సెంచ‌రీలు, 3 అర్ధ సెంచ‌ రీల‌తో 593 ప‌రుగులు చేసి వ‌రెవ్వా.. కోహ్లీ అనిపించాడు.  కానీ మ‌రు సంవ‌త్స‌రం 2019లో అదే కోహ్లీ అంత గా రాణించ‌లేక‌పోయాడు. ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్‌లో కేవ‌లం 134 ప‌రుగులే చేశాడు. ఇది యావ‌త్ ప్ర‌పంచ కోహ్లీ అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. కింగ్ ఇలా నీరుగారాడేమిటా అని మ‌ద‌న‌ప‌డ్డారు. అధికారులు ఏమీ మాట్లాడ‌లేక‌పోయారు. ఢిల్లీలో ప్ర‌తీ గ‌ల్లీక్రికెట‌ర్ అన్నా బ్యాట్ కి ఏమ‌యింది అన్నారు. 

ఇలాంటి ప‌రిస్థితులు ప్ర‌తీ క్రికెట‌ర్‌కీ వ‌స్తాయి. అయితే కోహ్లీ ఫైట‌ర్. త‌న పొర‌పాట్లూ, త‌ప్పిదాలు తెలుసు కుని త్వ‌ర‌లోనే మ‌ళ్లీ విజృంభిస్తాడ‌ని రవిశాస్త్రి, ద్రావిడ్‌, గంగూలీ వంటివారు క్రికెట్ లోకానికి త‌మ సందే శాలు పంపారు. కోహ్లీ ఆట‌లో వేగం త‌గ్గింద‌ని, ఇక ముందు ఇంత‌గా ఆడ‌లేడ‌న్న అనుమానాలు వ‌ద్దు, అత‌ను మ‌ళ్లీ ఆడ‌తాడు, జ‌ట్టులో అత‌ని స్థానం ప‌దిలం అని భారీ ఆశ‌లు క‌ల్పించారు.  2020లో మ‌ళ్లీ ఫామ్‌లోకి తిరిగి వ‌చ్చాడు కింగ్‌. అస‌లు అంత‌ర్జాతీయ కెరీర్‌ని ప‌రిశీలిస్తే, అత‌ను ఆడినన్ని మ్యాచ్‌లు కేవ‌లం 15 మంది మాత్ర‌మే ఆడ‌గ‌లిగారు. కోహ్లీ యావ‌రేజ్ 53 కాగా వారి యావ‌రేజ్ 50 మాత్ర‌మే!

గ‌తం వ‌దిలేద్దాం.. మ‌న కింగ్ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. ఇక ఆసియాక‌ప్ లో ప్ర‌తీ మ్యాచ్‌లోనూ అత‌ని బ్యాట్ నుంచి ప‌రుగుల వ‌ర‌దే ఉంటుంద‌ని ఆశిద్దాం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu