విరమణ మాత్రమే.. విరామం కాదు.. కేసీఆర్ కు కోదండరాం చురక
Published on: Sun Oct 11, 2015 5:10PM

తెలంగాణ జేఏసీ నేత కోదండరాం ముఖ్యమంత్రి కేసీఆర్ కు చురకలు అంటించేలా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన హరగోపాల్ తదితరులతో కలిసి మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ అంశంలో తమ ఉద్యమానికి విరామం మాత్రమేనని.. విరమణ మాత్రం కాదని.. తెలంగాణ బిల్లు విషయంలో కెసిఆర్‌తో పాటు అన్ని పార్టీలు కీలక పాత్ర పోషించాయని ఆయన అన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) కొనసాగుతుందని.. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ కంకణబద్దులం అవుదామన్నారు.


