రెండుగా విడిపోనున్న బీజేపీ

posted on: Sep 10, 2013 11:23AM

 

 

 

రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నోట్ కు మంత్రి వర్గం ఆమోదం వేయగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ రెండుగా విడిపోనుంది. తెలంగాణ,సీమాంద్ర లకు వేర్వేరుగా శాఖలను ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్దమవుతోంది. సీమాంధ్రకు, తెలంగాణకు ప్రత్యేక కార్యవర్గం, అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులను నియమించనున్నారు. ఈ విషయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు.

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేబినేట్ నోట్ కు మంత్రివర్గ ఆమోదం లభించాక ఇరుప్రాంతాల్లో బీజేపీ రెండు శాఖలను ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలంగాణ విషయంలో అన్ని పార్టీలు ద్వంద విధానాలు పాటిస్తున్నాయని, కానీ బీజేపీది ఎప్పటికి ఒకే మాట అని ఆయన అన్నారు. పార్టీల ద్వంద విధానాల మూలంగా రెండు ప్రాంతాలలో పరిస్థితులు అదుపుతప్పే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...