TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేజ్రీవాల్ కు వివాదాలంటే ఇష్టం.. కిరణ్ రిజిజు

Published on: Sat May 23, 2015 6:05PM

ఢిల్లీ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం విషయంలో ఎన్నో వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. వివాదాల మధ్యే కేంద్రం నజీబ్ జంగ్ ను లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించింది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను అడ్డం పెట్టుకొని బీజేపీ తమపై పెత్తనం చెలాయించాలని చూస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. కేజ్రీవాల్ కు వివాదాలతోనే కాలం సరిపోతుందని, ఎన్టీయే ప్రభుత్వానికి పరిపాలన ముఖ్యమని కానీ కేజ్రీవాల్ కు వివాదాలంటే మక్కువ ఎక్కువని విమర్శించారు.