Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎమ్మెల్యేల చెవిలో పువ్వులు...హరీష్ కు కిరణ్ వార్నింగ్
posted on: Jan 23, 2014 3:36PM
.jpg)
తెలంగాణ ముసాయిదా బిల్లుకు వ్యతిరేకంగా విభజనను నిరసిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో వెల్లడిస్తున్న అంశాల మీద తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు అడుగడుగునా అభ్యంతరాలు చెబుతున్నారు. సీమాంధ్ర ప్రజల చెవ్విలో ముఖ్యమంత్రి పువ్వులు పెడుతున్నారని, అబద్దాలు చెబుతూ తెలంగాణ మీద విషం కక్కుతున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలుపుతున్నారు. ఈ సంధర్భంగా చెవిలో పువ్వులు పెట్టుకున్న వారిని చూసి ముఖ్యమంత్రి చాలా అందంగా ఉన్నారని అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యులు హరీష్ రావును గురువారం శాసన సభలో హెచ్చరించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చ సమయంలో తన ప్రసంగంపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేయగా కిరణ్ ఘాటుగా స్పందించారు. హరీష్ రావు నోటిని అదుపులో పెట్టుకోవాలని, కాస్త కంట్రోల్లో ఉండాలని హెచ్చరించారు. ఏది అంటే అది మాట్లాడవద్దని సూచించారు. మరో సమయంలో ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు పైన ఏ సీమాంధ్ర నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు.



.jpg)


