Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చిరంజీవి వియ్యండుకిపై ఐ.టి. దాడుల వెనుక కిరణ్ హస్తం?
posted on: May 18, 2012 11:54AM
చెన్నైలోని చిరంజీవి వియ్యంకుడిపై జరిగిన ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల దాడి వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హస్తం ఉందా? అంటే ఉండనే అంటున్నారు పి.సి.సి. అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అనుచరులు. మరో రెండేళ్ళపాటు తానే అధికారంలో ఉంటానని ఇటీవల ప్రకటించిన కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తమ నాయకుడు బొత్సను బద్నాం చేశాడని, తనకు పోటీగా ఉంటాడనుకున్న చిరంజీవిని కూడా బలిపశువు చేయడానికి ఐ.ట్. దాడులు జరిపించారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన చిరంజీవి ఐ.టి. దాడులు జరిగిన వెంటనే ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను కలిసి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. చిరంజీవికి పార్టీ అధిష్టానం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది.
పార్టీ పరిశీలకుడు వాయిలార్ రవి చిరంజీవి ఇంటికి విందు భోజనానికి కూడా వెళ్ళారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి చిరంజీవిపై కన్నేసి ఉంచాడని, ఈ నేపథ్యంలో చిరంజీవికి చెందిన సొమ్ము తన వియ్యంకుడి ఇంట్లో ఉంచినట్లు సమాచారం అందడంతో తన సహచరుల ద్వారా ఐ.టి. అధికారులకు ఉప్పు అందించి దాడి చేయించారని వారు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం అసాధ్యమని అందువల్ల తనను మార్చి చిరంజీవికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే అవకాశం ఉందని కిరణ్ అనుమానిస్తున్నారు.
అందుకే ఆయన పరువుకు భంగం కలిగించడం ద్వాటా తన పబ్బాన్ని గడుపుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు బొత్స ముఖ్యమంత్రి పదవిపై కన్నేసి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న తరుణంలో ఆయనపై మద్యం సిండికేట్ దెబ్బ వేశారు. ఈ దెబ్బతో విలవిలలాడిన బొత్స ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అధిష్టానం చిరంజీవికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఆయనపై ఐ.టి.దాడుల అస్త్రాన్ని ప్రయోగించారు. ఐ.టి.దాడుల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాను మరో రెండేళ్ళపాటు అధికారంలో ఉంటానని, ఈ విషయంపై ఎవరికీ ఎటువంటి సందేహం అక్కరలేదని ప్రకటించడం విశేషం.



.png)


