ఖమ్మం కాంగ్రెస్‌లో అధిపత్యపోరు
posted on: Dec 1, 2013 5:14PM
.jpg)
భద్రాద్రి రాముడి సాక్షిగా ఖమ్మం జిల్ల కాంగ్రెస్‌లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి.. భద్రాచలం డివిజన్ తెలంగాణ ప్రాంతంలోనే కలిసుండాలన్న డిమాండ్‌తో యాత్ర చేపట్టిన రేణుకా చౌదరికి చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని కారేపల్లి వద్ద ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీగా వస్తున్న రేణుకాను అదే పార్టీకి చెందిన మరో నేతరాంరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. రేణుకా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు.







