వంశీ కేసులో కీలక పరిణామం...10 రోజుల కస్టడీ పిటిషన్ 

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎస్ సి ఎస్ టి కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. మరో వైపు వంశీ కూడా తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. తన ఆరోగ్యం బాగా లేదని వంశీ ఈ పిటిషన్ లో కోరారు. గన్నవరం టిడిపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అటు పోలీసుల, ఇటు వంశీ పిటిషన్లను వేర్వేరుగా స్వీకరించిన కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu