పల్లెల్లో డిజిటల్ కనెక్టివిటీ - కేంద్రం, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం

posted on: Feb 23, 2026 8:19AM

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది.   5 లక్షల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఫైబర్ కనెక్షన్లు అందించే లక్ష్యంతో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్  ఏబీపీ  అమలు కానుంది.  ఆంధ్రప్రదేశ్ లో ఏబీపీ అమలుకు రూ. 2,432 కోట్ల మేర నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.  ఏబీపీ కోసం ఆంధ్రప్రదేశ్ భారత్‌నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పేరుతో  స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పీవి)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

డిజిటల్ భారత్ నిధి - రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అంగీకారంతో నిధులు సమకూర్చి ప్రాజెక్టు అమలు చేసేలా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,, కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో డిజిటల్ భారత్ నిధి - ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.   డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, రాష్ట్ర ఐ అండ్ ఐ శాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ ఇన్‌ఫ్రా బలోపేతం, గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందిస్తారు. 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13,426 గ్రామ పంచాయతీలలో ప్రాజెక్టు అమలు చేసేలా ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది. తొలి దశలో  1,692  పంచాయతీల్లోని నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్ చేస్తారు.  రెండో దశలో 11,254  గ్రామాల డిజటల్ కనెక్టివిటీని పూర్తి చేస్తారు. ఇక కొత్తగా ఏర్పడిన 480 గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ ఇచ్చేలా చర్యలు చేపడతారు. డిజిటల్ కనెక్టివిటీ ద్వారా డిజిటల్ గవర్నెన్స్, ఆన్‌లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, ఈ-గవర్నెన్స్ వంటి సేవలను మరింత బలోపేతం చేసేలా ఏపీ సర్కార్ ప్రణాళికలను రూపొందించింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...