లాటరీలో 12 కోట్లు గెలుచుకున్న రోజువారీ కూలీ...

posted on: Feb 13, 2020 2:10PM

అతడు రోజువారీ కూలీ, ఇంట్లో అతను పని చేస్తే గానీ పూట గడవని పరిస్థితి. అయితే అతని కష్టాలను గట్టెక్కించేందుకు అదృష్టం లాటరీ రూపంలో తలుపు తట్టింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. కేరళకు చెందిన ఓ రోజూ కూలి లాటరీలో 12 కోట్లు గెలుచుకున్నాడు. కేరళ లోని కన్నూరు జిల్లా మురళి మాల కుర్చియా కాలనీకి చెందిన యాభై ఐదేళ్ల పోరునన్ రాజన్ దినసరి కూలీ. రెక్కాడితే గాని డొక్కాడదు, అవసరం కోసం అప్పులు తప్పలేదు. 

మూడు వారాల క్రితం ఓ రోజు రాజన్ రుణం కోసం వెళుతుండగా మార్గమధ్యలో లాటరీ టికెట్ సేల్ ఆకర్షించింది. అదృష్టంపై నమ్మకం లేకపోయినా ఎక్కడో ఓ చిన్న ఆశ టికెట్ కొనాలని ప్రేరేపించింది. అలా మూడు వందల రూపాయలు పెట్టి క్రిస్మస్, న్యూయర్ బంపర్ లాటరీ టికెట్ కొన్నాడు. అంత ఖరీదు పెట్టి లాటరీ టికెట్ కొన్నానని చెబితే ఇంట్లో వారు ఏమంటారో అని ఎవరికీ చెప్పలేదు. లాటరీ విజేతలను సదరు ఏజెన్సీ సంస్థ ప్రకటించగా అందులో రాజన్ కొన్న టికెట్ కు బంపర్ ఆఫర్ తగిలింది. ఆ లాటరీలో అతడు ఏకంగా పన్నెండు కోట్లు గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...