కేరళ స్పీకర్ కన్నుమూత

posted on: Mar 7, 2015 1:12PM

కాలేయ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న కేరళ అసెంబ్లీ స్పీకర్ జి. కార్తికేయన్ (66) శనివారం కన్నుమూశారు. బెంగుళూరులో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆయన మృతదేహాన్ని ఈరోజు సాయంత్రానికి కేరళ తరలించనున్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. కేరళలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఒమన్ చాంది అధికారిక కార్యక్రమాలు రద్దు చేసుకొని తిరువనంతపురం చేరుకున్నారు. కార్తికేయన్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. కార్తికేయన్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...